భారతదేశం, జూన్ 23 -- అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా "సుపరిపాలనలో తొలి అడుగు" పేరుతో నేడు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్వోడీలు (శాఖల అధిపతులు), సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో కలిసి జరుగుతున్న ఈ కార్యక్రమం మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, చేసిన మార్పులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని ఈ సమావేశంలో సమీక్షిస్తారు. అలాగే, వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చాలి, అభివ...