భారతదేశం, ఏప్రిల్ 26 -- విశాఖలో కూటమి ఎమ్మెల్యేలు రోడెక్కారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. శనివారం వీరిద్దరూ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం గంటా శ్రీనివాసరావు కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే, విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి ఆయనను సముదాయిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మాటలు వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని, ఆగ్రహంతో మాట్లాడడం వీడియోలో కనిపిస్తుంది. పక్కనున్న వారు గంటా శ్రీనివాసరావుకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, ఆయన అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదానికి అసలు కారణం విశాఖ ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయం అని తెలుస్తోంది. ఫిలింనగర్ క్లబ్ లీజు విషయంలో బీజేప...