భారతదేశం, మే 8 -- వైసీపీ హయంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేయడంతో పాటు, సూపర్‌ సిక్స్‌ హామీలను కూడా అమలు చేయక పోవడంపై ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ఏపీ ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే ఆయుధం వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. సరైన సమయంలో చంద్రబాబుకు ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో ఆఖండ విజయం తో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిమాణాలపై చర్చించి, పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశా...