భారతదేశం, ఏప్రిల్ 30 -- రాబోయే జనాభా గణనలో భాగంగా కుల గణనను కూడా చేపడ్తామని, ఈ కుల గణనను పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. గతంలో కొన్ని రాష్ట్రాలు కుల గణన చేపట్టాయని, అయితే, అవి పారదర్శకంగా లేవని, వాస్తవానికి జనాభా గణన నిర్వహించడం కేంద్రం పరిధిలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే జనాభా గణనలో కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) తీర్మానించినట్లు ఆయన తెలిపారు. కుల గణనకు సంబంధించి కేంద్రం ప్రకటనను కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు స్వాగతించాయి.

కుల గణన అనేది జనాభా ఆధారిత సర్వే. ఇది ఒక ప్రాంతంలోని లేదా దేశంలోని కులాల కూర్పుపై డేటాను సేకరిస్తుంది. ఇందులో కుల సమూహాల పంపిణీ, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యా స్థితి, సంబంధిత వివరాలు ఉంటాయి. వివిధ కులాల జనాభా, ఆయా కులాల అభివృద్ధ...