భారతదేశం, మే 1 -- కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేపట్టాలని నిర్ణయించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా ముగిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. కులగణనపై విధివిధానాలు అందరికి అందుబాటులో ఉంచాలని, కులగణనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేయాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. కులగణనలో తెలంగాణ అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకుంటామన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగం మార్చేసి ఈపాటికి రిజర్వేషన్లు రద్దు చేసి ఉండేవారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొదట్లో మోదీ ఆలోచన కూడా ఇదేనని రాజకీయ ఒత్తిళ్లతోనే నిర్ణయం మార్చుకున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కులగణన చేయాల్సిందేనని, బీహార్‌లో నితీష్‌ కుమార్‌ కుల గణన చేయాల్సిందేనని ఒత్తిడి చే...