భారతదేశం, జనవరి 8 -- స్పోర్ట్స్ బైక్ ప్రియులకు, ముఖ్యంగా ట్రాక్ రేసింగ్ అంటే ఇష్టపడే యువతకు కేటీఎం (KTM) అదిరిపోయే తీపి కబురు అందించింది. తన పాపులర్ ఆర్‌సీ (RC) సిరీస్‌లో అత్యంత సరసమైన ధరలో లభించే RC 160 బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ బైక్ ధర, ఫీచర్ల వివరాలు మీకోసం..

భారతదేశంలోని యువ రైడర్లను లక్ష్యంగా చేసుకుని కేటీఎం ఈ బైక్‌ను రూపొందించింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం దీని ధర రూ. 1.85 లక్షలు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కేటీఎం డీలర్‌షిప్‌లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో దీని ప్రధాన ప్రత్యర్థి యమహా ఆర్‌15 (Yamaha R15) అని చెప్పవచ్చు.

కేటీఎం బైక్ అంటేనే స్పీడ్. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్‌సీ 160లో పవర్‌ఫుల్ ఇంజిన్‌ను అమర్చారు:

ఇంజిన్: 164.2 సీసీ, లిక్విడ్ కూల్డ...