Andhrapradesh,n=tr district, ఏప్రిల్ 16 -- ఎన్టీఆర్ జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. వేరొక వ్య‌క్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని, భ‌ర్త‌కు దూరంగా ఉంటుంది. ప్రియుడి కోసం క‌న్న కూతురిపై త‌ల్లి క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించింది. త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉంద‌ని చిన్నారిపై అమాన‌వీయత‌ను ప్ర‌ద‌ర్శించింది. చిన్నారికి వాతలు పెడుతూ వ‌చ్చింది. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న‌ చిన్నారి మేన‌త్త పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు కేసు న‌మోదు చేసి, చిన్నారిని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లా కంచిక‌చ‌ర్ల మండ‌లం గండేప‌ల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండ‌లం అంబారుపేట గ్రామానికి చెందిన శోభ‌న్‌బాబు, సునీత దంప‌తులు ఉన్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే అదే గ్రా...