Hyderabad, జూన్ 24 -- కుబేర మూవీ బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఫస్ట్ వీకెండ్ ను రికార్డు కలెక్షన్లతో ముగించిన ఈ సినిమా.. తొలి సోమ, మంగళవారాల్లోనూ మంచి వసూళ్లే రాబట్టింది. ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గడం లేదు. తాజాగా ఐదో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూడండి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున, జిమ్ సర్భా ప్రధాన పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం 'కుబేర'. గత శుక్రవారం (జూన్ 20) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా ధనుష్ నటనకు ప్రశంసలు దక్కాయి. Sacnilk.com తాజా రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ రిపోర్టు ప్రకారం 'కుబేర' తన మొదటి మంగళవారం రూ.3.66 కోట్లు (అన్ని భాషలలో) వసూలు ...