Hyderabad, జూన్ 23 -- కుబేర మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ ను మరోసారి నిలబెట్టింది. కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇండస్ట్రీకి ఈ సినిమా కొత్త ఊపిరిలూదింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.80 కోట్ల మార్క్ అందుకుంది.

కుబేర మూవీ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. మూడోరోజైన ఆదివారం (జూన్ 22) ఇండియాలోనే రూ.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇది ఒక రోజు సాధించిన అత్యధిక మొత్తం కావడం విశేషం. మూడో రోజు తెలుగులో రూ.12.4 కోట్లు, తమిళంలో 4.5 కోట్లు వసూలు చేసింది.

దీంతో మూడు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.49 కోట్లు దాటాయి. సోమవారం (జూన్ 23) రూ.50 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్ కూడా అందుకోబోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ వసూళ్లు రూ.80 కోట్ల మార్క్ అందుకుంది. ఇండియాలోనే గ్...