Hyderabad, జూన్ 19 -- ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కుబేర ఒకటి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి కలిసి నటించిన సినిమానే కుబేర. ఈ సినిమాకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కించిన కుబేర సినిమాను అమిగోస్ క్రియేషన్స్, ఎస్‌వీసిఎల్ఎల్‌పీ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించిన నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేర జూన్ 20న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా థియేటర్లలో విడుదల కానుంది.

థియేట్రికల్ రిలీజ్‌కు ఒకటిరెండు రోజుల ముందుగానే కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్రిటిక్‌గా పేరు తెచ్చుకున్న ఉమైర్ సంధు కు...