భారతదేశం, జూలై 12 -- టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా ప్రశంసలు దక్కించుకోవడంతో కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఈ క్రైమ్ సోషల్ డ్రామా చిత్రంలో తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. డేట్ కూడా అధికారికంగా ఖరారైంది. అయితే, ఓటీటీ వెర్షన్ విషయంలో ఓ నిరాశ ఎదురుకానుందని తెలుస్తోంది.

కుబేర చిత్రం థియేటర్లలోకి సుమారు మూడు గంటల రన్‍టైమ్‍తో వచ్చింది. కొన్ని సీన్లను కట్ చేస్తేనే ఆ నిడివి సాధ్యమైంది. అయితే, థియేట్రికల్ వెర్షన్ కోసం కట్ చేసిన కొన్ని డిలీటెడ్ సీన్లతో ఓటీటీలోకి కుబేర వస్తుందనే అంచనాలు వినిపించాయి. ఓటీటీ వెర్షన్ మరింత ఎక్కువ...