Hyderabad, జూలై 11 -- శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఆ ఓటీటీ శుక్రవారం (జులై 11) వెల్లడించింది. జులై 18 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది.

తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కుబేర ఓటీటీ రిలీజ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే శుక్రవారం అంటే జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది.

"ఓ సింపుల్ మనిషి. కానీ అతని అంత సింపుల్ కాని రిడెంప్షన్ జర్నీ. కుబేర ప్రైమ్ లో జులై 18 నుంచి" అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ఈ విషయం వెల్లడించింది. మొత్తం ఐదు భాషల్లో స్...