భారతదేశం, జనవరి 30 -- జీవితం అనేది క్షణాల వ్యవధిలో మారిపోతుంటుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వారి జీవితాల్లో ఒక్కసారిగా విషాదం అలముకోవచ్చు. తీవ్ర బాధ ఎదురవ్వొచ్చు. ఈ పరిస్థితుల మధ్య.. "మనం లేని సమయంలో మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి?" అన్న ప్రశ్న అందరిని భయపెడుతూనే ఉంటుంది. దీనికి సమాధానం.. 'టర్మ్​ ఇన్సూరెన్స్​'!

తక్కువ ప్రీమియంతో, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు టర్మ్​ ఇన్సూరెన్స్​ అనేది బెస్ట్​ ఆప్షన్​. అయితే మీ కుటుంబం ప్రస్తుతం ఎలా జీవిస్తోంది? భవిష్యత్తులో వారి అవసరాలు ఎలా ఉండబోతున్నాయి? వంటివి అర్థం చేసుకున్నప్పుడే మీరు సరైన టర్మ్​ ప్లాన్‌ను ఎంచుకోగలరు. ఈ నేపథ్యంలో మీ కుటుంబానికి సరైన టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ని తీసుకునే ముందు పరిగణించాల్సిన కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆప్షన్లను చూసేముందు, మీ కుటుంబం ఆర్థికంగా దేని...