Hyderabad, జూలై 1 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, వాటి స్థానంలో మార్పులు ఆధారంగా ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే, కుజుడు ఇప్పటికే కేతువు ఉన్న సింహ రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు, కేతువు రెండు ఉగ్ర గ్రహాలు. జూన్ 30 నుంచి కుజుడు, కేతువులు ఒకే రాశిలో సంచారం చేస్తారు. దీని కారణంగా అశుభ సంయోగం ప్రభావం పెరుగుతుంది. జూలై 28 వరకు ఈ కలయిక ఉంటుంది.

ఇది మూడు రాశుల వారిపై భారీ ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మరి ఈ మూడు రాశులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ రాశుల వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి కుజ కేతువుల సంయోగం ఇబ్బందులను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనారోగ్య సమస్యలను ఎద...