భారతదేశం, జనవరి 29 -- ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వాస్తు ప్రకారం కూడా పరిహారాలను పాటించడం, ప్రతికూల శక్తి కలగకుండా సానుకూల శక్తి కలిగేలా జాగ్రత్తలు తీసుకోవడం ఇలా ఎవరికీ తోచిన పద్ధతులను వారు పాటిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ రోజూ ఇంట్లో దీపం వెలిగిస్తారు.

ఇంట్లో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, ఆనందంగా ఉండొచ్చని, ప్రతికూల శక్తి మాయమైపోతుందని భావిస్తారు. సాధారణంగా దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలా ఎవరికి నచ్చిన నూనెను వారు కుందులో వేసి రెండు వత్తులు వేసి వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్దిగా కుంకుమ, పసుపుతో అలంకరించి అక్షింతలు, పుష్పం వేసి నమస్కారం చేసుకుంటారు.

ఇది ఇలా ఉంటే చాలామంది కొన్ని సమస్యలతో బాధ పడుతుంటారు. అలాం...