Hyderabad, ఆగస్టు 25 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు కన్య రాశిలో ఉన్నాడు. త్వరలోనే చంద్రుడితో సంయోగం చెందబోతున్నాడు. కుజుడు-చంద్రుడు కలిసినప్పుడు మహాభాగ్య యోగం లేదా చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆర్థిక పరంగా కూడా శుభ ఫలితాలు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.

ఆగస్టు 25 ఉదయం 8:08కి చంద్రుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఇప్పటికే ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండిటికి సంయోగం ఆగస్టు 27 రాత్రి 7:21 వరకు ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ యోగం వలన మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మరి మహాభాగ్య యోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు తెలుసుకుందాం.

మేష రాశి వారికి మహాభాగ్య యోగం మంచి ఫ...