Hyderabad, ఆగస్టు 21 -- రామ్ గోపాల్ వర్మ మరోసారి ఎక్స్ లో తీవ్రంగా స్పందించాడు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి అతడు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనను 'డాగ్ హేటర్' అని పిలిచిన సోషల్ మీడియాలోని ఒక వర్గంపై ఆర్జీవీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్ లో ఒక నోట్ రాసిన ఆర్జీవీ.. వీధి కుక్కల సమస్య చాలా దూరం వెళ్లిపోయిందని, దీనిని విస్మరించలేమని, పరిష్కారాలు ఆచరణాత్మకతతో పాటు 'కరుణ'ను కూడా కలిగి ఉండాలని అన్నాడు.

తన నోట్‌లో రామ్ గోపాల్ వర్మ ఇలా రాశాడు. "నన్ను డాగ్ హేటర్ అని భావించే తెలివితక్కువ కుక్కల ప్రేమికులకు నేను ఇది చెబుతున్నాను. మీకు కళ్లు కనిపించడం లేదా? చెవులు వినిపించడం లేదా? మెదడు పనిచేయడం లేదా? పిల్లలను కుక్కలు కరుస్తున్న, ముక్కలు చేస్తున్న, చం...