భారతదేశం, డిసెంబర్ 15 -- వ్యవసాయం, మత్స్య సంపద, ఆర్థిక వృద్ధి, సామాజిక సూచికలలో రాష్ట్రం బలమైన పనితీరును కనబరిచింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అనేక కీలక రంగాలలో ముందంజలో ఉంది. ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్‌ను పండ్ల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపింది. 19.3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే అతిపెద్ద పండ్ల ఉత్పత్తి రాష్ట్రంగా నిలిచింది.

ఇక మత్స్య రంగంలో ఏపీ ఆధిపత్యాన్ని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 5.158 మిలియన్ టన్నుల రికార్డును నమోదు చేస్తూ, చేపల ఉత్పత్తిలో కూడా రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మామిడి, బత్తాయి, బొప్పాయి, నిమ్మ వంటి పండ్లలో దేశంలోనే అత్యధిక ఉత్పత్తి చేస్తోంది ఏపీ. అక్వాకల్చర్‌లో ఏపీ దేశంలోనే 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.

ఆర్థిక రంగంలో, ఆంధ్రప్రదేశ్...