భారతదేశం, నవంబర్ 13 -- మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మరోసారి మాస్ యాక్షన్ అవతార్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె నటించిన రివాల్వర్ రీటా మూవీ ట్రైలర్ గురువారం (నవంబర్ 13) రిలీజైంది. ఈ మూవీలో సునీల్ కూడా విలన్ గా తిరిగి వస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఆసక్తికరంగా ఉండబతోంది.

చాలా రోజులుగా ఊరిస్తున్న మూవీ రివాల్వర్ రీటా. కీర్తి సురేష్ ఈ టైటిల్ రోల్ పోషిస్తోంది. మూవీ ఓ మాంచి కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ ట్రైలర్ మొదట్లోనే విలన్ తండ్రి కిడ్నాప్ కావడం, అతన్ని రీటానే ఎత్తుకెళ్లడం, తర్వాత ఆమె ఇంట్లోనే అతడు చనిపోవడం, ఆ విషయం తెలిస్తే తమ పరిస్థితి ఏమవుతుందో అని వాళ్లు భయపడటం, తన ఇంట్లో వాళ్లను కాపాడటానికి రివాల్వర్ రీటా బయలుదేరడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. 2 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపేలా సాగింది. ...