Hyderabad, ఏప్రిల్ 12 -- ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేసే కీరదోసకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ముఖ్యంగా వేసవిలో నీటితో నిండిన దోసకాయలు చాలా చల్లగా, రుచిగా ఉంటాయి. వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బయట వేడితో పాటు శరీరంలోని వేడిని కూడా తీసిపడేస్తాయి. అందుకే దీన్ని వివిధ రకాలుగా తమ ఆహారంలో చేర్చుకుంటారు. సలాడ్లు, రైతాలతో పాటు సాండ్‌విచ్, పిజ్జా వంటి వాటిల్లో ఫిల్లింగ్‌గా కూడా దోసయకాయను వాడుతుంటారు.

నిజానికి కీరదోసకాయలను తినడం చాలా ప్రయోజనకరమైనది. కానీ కొన్నిసార్లు వీటిని తినే విధానం లాభాలకు బదులుగా నష్టాలను తెచ్చిపెడుతుందని మీకు తెలుసా. వీటిని ఇతర పదార్థాలతో కలిపి తినేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఇదనే కాదు చాలా రకాల ఆహార పదార్థాలను ఇతర పదార్థాలతో కలిపి తినడం మంచిది కాదని అధ్యయనాలు చెబుతన్నారు. రెండు భిన్నమైన...