Hyderabad, అక్టోబర్ 13 -- నటి సోనమ్ బజ్వా ఒకప్పుడు కిస్సింగ్ సీన్‌లు ఉన్నాయనే కారణంతో అనేక బాలీవుడ్ ఆఫర్‌లను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తనపై తనకు ఉన్న నమ్మకం కంటే ఎక్కువగా భయం, సెల్ఫ్ డౌట్ వల్ల తీసుకున్నవే అని ఆమె చెప్పింది. అయితే ఆ తర్వాత తన పేరెంట్స్ కు ఇదే విషయం చెబితే సినిమా కోసమే కదా చేసినా ఫర్వాలేదనడంతో తాను షాక్ తిన్నట్లు సోనమ్ తెలిపింది.

ఫిల్మ్ కంపానియన్ తో సోనమ్ బజ్వా మాట్లాడింది. తెలుగులో వెంకటేశ్ తో కలిసి బాబు బంగారం మూవీతోపాటు ఆటాడుకుందాం రా అనే మరో సినిమా కూడా ఆమె చేసింది. ఈ పంజాబీ స్టార్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న భయాలను ఈ ఇంటర్వ్యూలో వివరించింది. స్క్రీన్ పై తాను ఇంటిమేట్ సీన్లలో నటిస్తే పంజాబ్ లోని ప్రేక్షకులు ఏమనుకుంటారో అని అనుకునేదానినని చెప్పింది.

"పంజాబ్‌లో అందరూ ఓకే అంటారా అని ఆలోచించి, నేను బాల...