భారతదేశం, నవంబర్ 18 -- భారత మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో గొప్ప విజయాన్ని సాధించింది. నిజానికి, ఈ 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న ఎస్‌యూవీ కియా మార్కెట్ వాటాను పెంచడంలో చాలా సహాయపడింది. మరోవైపు మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఉంది సైతం కస్టమర్స్​ని ఆకర్షిస్తోంది. ఇది ఎక్స్​యూవీ 300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. ఈ నేపథ్యంలో ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న తేడాలను, పోలికలను ఇప్పుడు చూద్దాం.

కియా సోనెట్ ఎస్​యూవీ దాని అగ్రెసివ్​ డిజైన్​ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇది సొగసైన ఎల్ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఆకర్షణీయమైన టైగర్​ నోస్​ గ్రిల్, మందపాటి ప్లాస్టిక్ కప్పుతో కూడిన వీల్​ ఆర్చీలను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో, నిలువుగా ఉంచిన ఎల్ఈడీ టెయిల్​ ల్యాంప్స్​, కనెక్టెడ్​ లైట్​ బార్​ ఉండడం వల్ల ఇది సెల్టోస్ నుంచి డిజైన్​ ప్రేరణ పొం...