భారతదేశం, జనవరి 16 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కియా ఇండియా, తాజాగా తన 'సైరోస్' (Syros) ఎస్‌యూవీ శ్రేణిని మరింత విస్తరించింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, మధ్యస్థాయి బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ 'HTK (EX)' అనే సరికొత్త ట్రిమ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ రావడంతో సైరోస్ లైనప్‌లో మొత్తం వేరియంట్ల సంఖ్య ఏడుకు చేరుకుంది.

కియా సైరోస్ HTK (EX) పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 9.89 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఇక డీజిల్ ఇంజన్ ఆప్షన్ కావాలనుకునే వారికి ఇది రూ. 10.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బేసిక్ HTK వేరియంట్‌కు, హై-ఎండ్ వేరియంట్లకు మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేస్తూ కియా ఈ కొత్త మోడల్‌ను రూపొందించింది.

HTK (O) వేర...