భారతదేశం, జూలై 29 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న కియా మోటార్స్​ కొన్ని నెలల క్రితమే క్యారెన్స్​ క్లావిస్​ పేరుతో ఒక ఐసీఈ (ఇంటర్నల్​ కంబషన్​ ఇంజిన్​) కారును విడుదల చేసింది. ఇక ఈ మోడల్​కి ఎలక్ట్రిక్​ వర్షెన్​ని సైతం ఇటీవలే ప్రవేశపెట్టింది. దాని పేరు కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ. ఆసక్తికరంగా.. కియా క్యారెన్స్ క్లావిస్ ఎంపీవీ భారతదేశంలో ఐసీఈ, ఎలక్ట్రిక్ వర్షెన్​ రెండింటిలోనూ అందుబాటులో ఉన్న కొన్ని కార్లలో ఒకటి. ఇతర మోడళ్లలో టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా టియాగో, టాటా టిగోర్, టాటా హారియర్, హ్యుందాయ్ క్రెటా మొదలైనవి ఉన్నాయి.

కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ, కియా బ్రాండ్​లో భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. స్థానిక ఉత్పత్తి కారణంగా, క్యారెన్స్ క్లావిస్ ఈవీ పోటీ ధరతో వస్తుంది. ఇది బ్రాండ్ నుంచి అత్...