భారతదేశం, సెప్టెంబర్ 1 -- సాధారణంగా హై బీపీకి అనేక కారణాలు ఉంటాయి. అయితే కిడ్నీ వ్యాధుల వల్ల కూడా కొన్నిసార్లు రక్తపోటు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుంది. దీనినే రెనల్ హైపర్‌టెన్షన్ అంటారు. ఇది తీవ్రమైన సమస్య. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె జబ్బులు, కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండాల నిపుణుడు) డాక్టర్ భాను మిశ్రా హెచ్చరిస్తున్నారు. హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు.

రెనల్ హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి సరైన ఆహారపు అలవాట్లు మొదటి అడుగు. సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. ఉప్పు తగ్గించడం వల్ల కిడ్నీలు సమర్థవంతంగా పనిచేసి బీపీ తగ్గుతుంది. అరటిపండ్లు వంటి పొటాషియం ...