భారతదేశం, సెప్టెంబర్ 4 -- మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపే అతిపెద్ద సమస్యల్లో ఒకటి కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాల్లో రాళ్లు). ఈ సమస్యతో బాధపడేవారు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, అసౌకర్యంతో నరకయాతన అనుభవిస్తుంటారు. కిడ్నీలో ఏర్పడే ఈ రాళ్లు కేవలం పరిమాణంలోనే కాకుండా, వాటి కూర్పులోనూ తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను నిపుణుల సలహాలతో తెలుసుకుందాం.

అహ్మదాబాద్‌లోని నారాయణ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డా. రాఘవేంద్ర కశ్యప్ మాట్లాడుతూ.. మూత్రపిండాల్లో రాళ్లు రోగులకు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయని, ప్రస్తుతం జీవనశైలి మార్పుల వల్ల చాలామంది ఈ సమస్యతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని అన్నారు. "మూత్రపిండాల్లో రాళ్లు అంటే ఖనిజాలు, యాసిడ్ లవణాలతో ఏర్పడే ...