Hyderabad, మే 4 -- చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బాడీ స్క్రబ్ చాలా ముఖ్యం. చర్మంపై పేరుకుపోయిన పాత కణాలను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా స్క్రబ్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా తయారు చేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట, జిడ్డు, సూర్యుడి నుంచి విడుదలయ్యే హాని కరమైన కిరణాల కారణంగా చర్మం మరింత దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి బాడీ స్క్రబ్ మరింత అవసరం.అందుకే చాలా మంది స్క్రైబ్ కోసం మార్కెట్లో అనేక రకాల స్క్రబ్‌లు కొంటుంటారు. పార్లర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు చేస్తుంటారు. వీటి వల్ల ఖర్చు ఎక్కువ ప్రయోజనాలు తక్కువ.

మంచి ఫలితాలు పొందాలంటే డబ్బు వృథా కాకుండా ఉండాలంటే చర్మానికి సహజమైన పదార్థాలను వాడటం చాలా మంచిది. అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే పదార్థాలతో అయితే మరీ మంచిది. అలాంటి ఒక అద్భుతమైన, ప్రభావవంతమైన నేచురల్ స్క్రబ్ నే మీ కోసం మే...