Hyderabad, ఏప్రిల్ 3 -- ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహార పదార్థాలను తినడం మాత్రమే కాదు సరైన పద్థతిలో తినడం కూడా చాలా అవసరం. మీరు సరైన ఆహారాన్ని తింటున్నారు సరే.. కానీ దాన్ని సరైన పద్ధతిలోనే తింటున్నారో లేదో మీకు తెలుసా? భోజనం చేసేటప్పుడు నేల మీద కూర్చుని తినడం సాంప్రదాయకంగా పాటిస్తున్న పద్ధతి. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదని పద్ధతి అని మన పెద్దలు చెబుతుంటారు.ఇలా ఎందుకంటారు? నేల మీద కూర్చని భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఇది మీ కోసమే. కింద కూర్చుని తినడం వ్లల కలిగే ప్రయోజనాలేంటని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.

ఈమధ్య కాలంలో దాదాపు చాలా ఇళ్లలో డైనింగ్ టేబుల్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే బయటికి వెళ్లినప్పుడు బఫెట్ సిస్టమ్ కామన్ అయిపోయింది. కుదరని పక్షంలో నిల్చుని చేతుల్లో ప్లేటు పెట్టుకుని తినేస్తున్న...