భారతదేశం, జూలై 17 -- అలవోకగా సెంచరీలు బాదేసి.. టన్నుల కొద్దీ పరుగులు చేసి.. రికార్డుల దుమ్ము దులిపే రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో అద్భుతం అందుకున్నాడు. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న క్రికెట్లో ఇప్పటివరకూ మరే క్రికెటర్ కు సాధ్యం కాని ఫీట్ సొంతం చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఫార్మాట్లలోనూ 900 కి పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు విరాట్. మూడు ఫార్మాట్లలోనూ తన ఆధిపత్యానికి ఇదే రుజువు.

టెస్టు, వన్డే, టీ20ల్లో తనకు తిరుగులేదని విరాట్ మరోసారి చాటిచెప్పాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పటికీ అతని రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. తాజాగా ఐసీసీ ప్రకటించిన రేటింగ్స్ లో టెస్టుల్లో 937 పాయింట్లు, వన్డేల్లో 909 పాయింట్లు, టీ20ల్లో 909...