భారతదేశం, నవంబర్ 6 -- మైఖేల్ జాక్సన్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ప్రపంచ సంగీత చరిత్రలో అతడొక ఎవర్‌గ్రీన్ లెజెండ్. అతని జీవితంపై బయోపిక్ రాబోతోందని అనౌన్స్ చేసినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం ఆలస్యం తర్వాత ఇప్పుడు మేకర్స్ 'మైఖేల్' సినిమా మొట్టమొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో దివంగత సంగీత దిగ్గజం పాత్రలో అతని మేనల్లుడు నటించడం విశేషం.

కింగ్ ఆఫ్ పాప్ గా పేరుగాంచిన మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఈ మైఖేల్ మూవీ రూపొందుతోంది. గురువారం (నవంబర్ 6) టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివి గల ఈ టీజర్ ద్వారా మైఖేల్ మేనల్లుడు, జెర్మైన్ జాక్సన్ కుమారుడు అయిన జాఫర్ జాక్సన్.. 'కింగ్ ఆఫ్ పాప్' పాత్రలో ఎలా ఒదిగిపోయాడో ఒక చిన్నపాటి గ్లింప్స్ చూపించారు.

ఇందులో మైఖేల్ అత్యంత పాపులర్ అయిన ఆల్బమ్‌లలో ఒకటైన 'థ్రిల్లర్'ను విడుదల చే...