Hyderabad, జూలై 31 -- టైటిల్: కింగ్డమ్

నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ తదితరులు

దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్ ఐఎస్సీ, గిరీష్ గంగాధరన్ ఐఎస్సీ

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

విడుదల తేది జూలై 31, 2025

పలు సినిమాల ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా కింగ్డమ్. మళ్లీ రావా, జెర్సీ వంటి చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాను తెరకెక్కించాడు. దీంతో భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలో కింగ్డమ్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కింగ్డమ్ రివ్యూలో తెలుసుకుందాం.

సూరి (విజయ్ దేవరకొండ) తెలివితేటలు ఉన్న పోలీస్ కానిస్టేబుల్. చినప్పుడు తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపో...