Hyderabad, మే 2 -- విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి శుక్రవారం (మే 2) ఫస్ట్ సింగిల్ రిలీజైంది. హృదయం లోపల కదనం జరిగెనా అంటూ సాగిన ఈ పాట రాబోయే రోజుల్లో బ్లాక్‌బస్టర్ గా నిలిచేలా కనిపిస్తోంది.

కింగ్డమ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తున్న విషయాన్ని రెండు రోజుల ముందే ఓ ప్రోమో ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇందులో విజయ్, భాగ్యశ్రీ మధ్య ఓ ఘాటు కిస్సింగ్ సీన్ కూడా ఉంది. ఆ ప్రోమో ఇన్‌స్టాంట్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజైంది. దీనికి కూడా నిమిషాల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ తో 'హృదయం లోపల' పాటను అందంగా మలిచాడు. అంతేకాదు అతడే ఈ పాట పాడాడు. అనుమిత నదేశన్ తో కలిసి ఈ డ్యుయెట్ పాడటం విశేషం. ఈ పాటకు కేకే ...