Hyderabad, జూలై 31 -- వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ గురువారం (జులై 31) కింగ్డమ్ మూవీతో మరో అగ్ని పరీక్షకు సిద్ధమయ్యాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సోషల్ మీడియాలో మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. యూఎస్ ప్రీమియర్స్ చూసిన అభిమానులు చాలా వరకు సినిమా బాగుందని ట్విటర్ రివ్యూలు ఇస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గురువారం ఉదయం నుంచే కింగ్డమ్ మూవీ హడావిడి మొదలు పెట్టారు. దీంతో ఎక్స్ లో #KingdomMANAMKODTHUNAM టాప్ ట్రెండింగ్ లో ఒకటిగా ఉంది. యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్ట్స్ లెవెల్ అని చాలా మంది అంటున్నారు. అనిరుధ్ బీజీఎం ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అని కూడా స్పష్టం చేశారు....