Hyderabad, ఆగస్టు 3 -- విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా 3వ రోజు మంచి కలెక్షన్లను రాబట్టింది. స్పై గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కింగ్డమ్ సినిమా చాలా వాయిదాల తర్వాత జూలై 31న థియేటర్లలో విడుదలైంది. డీసెంట్‌ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా రెండో రోజు డ్రాప్ కనిపించినా మొదటి శనివారం అంటే మూడో రోజు మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే, ఓపెనింగ్ డే కలెక్షన్స్‌తో పోలిస్తే పెద్దగా కింగ్డమ్ కలెక్షన్స్ మెరుగపడలేదు. కింగ్డమ్ సినిమాకు మూడో రోజు ఇండియాలో రూ. 8.08 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. వాటిలో తెలుగు నుంచి రూ. 7.39 కోట్లు, తమిళం నుంచి 69 లక్షలుగా ఉన్నాయి. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు భారతదేశంలో 7.73 శాతం కలెక్షన్స్ పెరిగాయి.

ఇక మూడు రోజుల్లో కింగ్‌డమ్ సినిమాకు ఇండియాలో రూ. 33.58 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. శనివ...