Hyderabad, జూలై 31 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం అంటే ఇవాళ (జూలై 31) థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇంకా ఓవర్సీస్‌లో అంతకుమించి మంచి వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు.

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం భారతదేశంలో మొదటి రోజు కింగ్డమ్ సినిమాకు ఇప్పటివరకు రూ. 7.07 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం షోల ఆధారంగా అందిన సమాచారం ఇది. నైట్ షోలు ముగిసిన తర్వాత ఫైనల్ ఫిగర్ బయటకు వస్తుంది.

అయితే, కింగ్డమ్ సినిమాకు బుక్ అయిన ప్రీ బుకింగ్స్ ప్రకారం రూ. 11 నుంచి 12 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కాకుండా ఈ ఏడాది మీడియం రేంజ్ హీరోల్లో ఎవరు అందుకోని ఓపెనింగ్ డే క...