భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. రెయిలింగ్ ఊడిపడి ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. చాలా మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆ తర్వాత ఘటన స్థలానికి వెళ్లారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని లోకేశ్ వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు.

ఘటన జరిగిన తర్వాత మంత్రి నారా లోకేశ్ బయలుదేరి కాశీబుగ్గ వచ్చారు. ఘటన స్థలంతోపాటుగా పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చులో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారని లోకేశ్ అన్నారు. ఇంత మంది భక్తులు వస్తారని ఎవరూ ఊహ...