భారతదేశం, నవంబర్ 2 -- ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో ఒక బాలుడు, 8 మంది మహిళలు ఉన్నారు. 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కార్తీక ఏకాదశి సందర్భంగా దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షలు, అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

తొక్కిసలాట జరిగి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తాజాగా పరిహారం అందజేసింది. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద...