భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కార్తీక మాసం శనివారం, ఏకాదశి కావటంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన మీద ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ప్రకటించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. 'శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్...