భారతదేశం, జూన్ 14 -- యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు శనివారం (జూన్ 14) తెగ వైరల్ గా మారాయి. త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రియాక్టయ్యారు. ఎక్స్ లో పోస్టు చేశారు. పుకార్లను కొట్టిపారేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో పెళ్లి రూమర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్పందించారు. శనివారం ఎక్స్ లో పోస్టు పెట్టారు. "వివాహమా? లాల్ .. చిల్ అవ్వండి గాయ్స్. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకండి" అని పేర్కొన్నారు. రెడ్డిట్ లో ఒక రోజు మొత్తం అనిరుధ్, కావ్య వివాహం గురించే డిస్కసన్ జరిగింది.వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వ...