భారతదేశం, జనవరి 15 -- నెల్లూరు జిల్లా లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ​కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పట్టాలు తప్పగా. ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ​ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు,సిబ్బంది వెంటనే ​ఘటనా స్థలానికి చేరుకున్నారు. ​ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలికి డివిజన్ రైల్వే అధికారులు చేరుకొని రైళ్ల పునరుద్దరణ పనులను పర్య వేక్షిస్తున్నారు. విజయవాడ - చెన్నై మార్గంలో నడుస్తున్న కొన్ని రైళ్లకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం లోగా ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని రైళ్ల రాకపోకలను తిరిగి ఆ ట్రాక్ మీదుగా వెళ్లే విధంగా ప్ర...