భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, రావులపాలెం నుంచి స్పెషల్ సర్వీసులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. మే 15వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ యాత్రలో వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, రామప్ప దేవాలయం, కాళేశ్వరం ప్రాంతాలను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 995922557 నంబర్‌కు కాల్ చేయవచ్చని.. ప్రజా రవాణా అధికారి ఎస్టీపీ కుమార్ సూచించారు.
ఈ పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు జరుగుతాయి. గురుడు మిథున రాశిలో ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా భావించే సరస్వతీ నదుల సంగమ స్థానం. ఈ సంగమం చాలా పవిత్రమైనదిగా భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.