భారతదేశం, అక్టోబర్ 29 -- రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారిగా విశ్లేషణలు జరగాలని స్పష్టంగా చెప్పారు. 'కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్' (CDSE) కు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇటీవల రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారిగా సమగ్రమైన వివరాలతో విశ్లేషణలు జరగాలని, రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌లను తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ సమక్షలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ర...