భారతదేశం, ఆగస్టు 4 -- హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ నివేదిక సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్ ముందు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజీల నిర్వహణ వరకు జరిగిన లోపాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని నివేదిక తేల్చిచెప్పింది.

ఘోష్ కమిషన్ నివేదిక కేవలం కేసీఆర్‌నే కాకుండా అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును కూడా బాధ్యుడిగా పేర్కొంది. అంతేకాకుండా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా నివేదికలో స్పష్టంగా ప్రస్తావించారు.

కేసీఆర్, హరీష్ రావుల పాత్ర: ప్...