భారతదేశం, సెప్టెంబర్ 1 -- కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో ప్రవేశపెట్టిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ నిండిపోయింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. గంటలతరబడి చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదాను విస్మరించడమే కాకుండా, దాని డిజైన్‌ను మార్చి ఖర్చును రూ.1.5 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు.

కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్...