భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు శుక్రవారం తెలియజేసింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఒకవేళ ఈ నివేదికను ఏవైనా అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

విచారణను ఐదు వారాలకు వాయిదా వేసిన కోర్టు.. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత పిటిషనర్లు తమ సమాధానాలను ఒక వారంలోగా సమర్పించవచ్చు.

విచారణ సమయంలో, పిటిషనర్ల తరపు న్యాయవాదులు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇ...