భారతదేశం, సెప్టెంబర్ 2 -- తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే చర్చ. తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాడీవేడిగా చర్చ సాగింది. గంటలతరబడి చర్చల అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్రమాలను తేల్చేందుకు సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాజాగా విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎందుకంటే ఈ విషయం న్యాయ సమీక్షలో ఉందని తెలిపింది. సెలవు తర్వాత రాష్ట్రం తన ప్రతిస్పందనను దాఖలు చేయాలని క...