భారతదేశం, ఏప్రిల్ 29 -- కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికను విడుదల చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారికి ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ ఇటీవల లేఖ రాశారు. బ్యారేజీల నిర్వహణ లోపాలే ఈ సమస్యలకు కారణమన్నారు. మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని నివేదికలో పేర్కొంది. .

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

ఏప్రిల్ 24, 2025న ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదిక సమర్పించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ...ప్రజాధనంతో నాణ్యత లేకుండా బ్యారేజీ...