Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఉదయం బీసీ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చ జరిగాయి. సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావ్ ప్రసగించారు. ఈ సందర్భంగా నేతల మధ్య డైలాగ్ వార్ నడించింది.

సభలో మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వకపోవటంపై బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోష్‌ కమిషన్‌ నివేదిక ప్రతులను చించివేశారు. లాసభ నుంచి బయటకు వచ్చి సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎదుట వద్ద ఉన్న గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు.

అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడేందుకు టైం ఇవ్వకుండా గొంతు నొకే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్య...