భారతదేశం, ఆగస్టు 1 -- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణా నేతల ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఏనాడు అడ్డుపడలేదన్నారు. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను మేం లిఫ్ట్ చేసుకుని ఉపయోగించుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.

"మిగులు జలాలను రాయలసీమకు తీసుకువెళ్తే వారికి ఇబ్బంది ఎందుకు? ఆ మాటకొస్తే రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ లేకుండా కాళేశ్వరం ఎలా కట్టారు? కొందరు రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణాలో పెట్టుబడులను మేం ఏనాడైనా అడ్డుకున్నామా?" అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

"రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించింది ఏపీ భూభాగంపైన. అక్కడొక రూల్, ఇక్కడొక రూలా..? ఆం...