భారతదేశం, సెప్టెంబర్ 1 -- కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, హరీశ్ రావు మీద బాంబు పేల్చారు. కేసీఆర్ మీద నిందలు రావడానికి కారణాలు ఏంటి అని ప్రశ్నించారు.

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని ఎమ్మెల్సీ కవిత అడిగారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే రెండో టర్మ్‌లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకుంటున్నాయన్నారు.

'నాపై కుట్రలు చేసినా సహించాను. కానీ కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్నాను. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడు. అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. న...